Friday, April 26, 2024

కొడుకును చంపిన తండ్రికి ఏడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Seven years in prison for father who killed son

హైదరాబాద్: మద్యానికి బానిసగా మారిన కుమారుడిని హత్య చేసిన తండ్రికి ఏడేళ్ల జైలు, రూ.600 జరిమానా విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…. నేరేడ్‌మెట్, కృష్ణానగర్‌కు చెందిన మోహన్ నాయుడు(63) కుమారుడు మహేందర్ నాయుడు(28) కొన్ని రోజులు గ్యాస్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. కొద్ది రోజుల తర్వాత ఉద్యోగం పోవడంతో మద్యానికి బానిసగా మారాడు. రోజు మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో 13, అక్టోబర్, 2018న మహేందర్ నాయుడు, అతడి స్నేహితుడు కృష్ణం రాజు కలిసి ఉదయం 9.30గంటలకు మద్యం తాగేందుకు బయటికి వచ్చారు. మద్యం తాగి ఇంటికి వచ్చారు, తర్వాత మళ్లీ మద్యం తాగేందుకు మహేందర్ బయటికి వెళ్లి ఉదయం 11గంటలకు తిరిగి వచ్చాడు. కృష్ణం రాజు సాయంతో మళ్లీ వచ్చిన ఇంటి తలుపులు కొట్టడంతో ఆవేశంతో వచ్చిన మోహన్ నాయుడు ఆవేశంగా కత్తితో ఛాతిలో పొడిచి చంపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్‌స్పెక్టర్ నర్సింహ స్వామి దర్యాప్తు చేసి కోర్టులో హాజరు పర్చాడు. సాక్షాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Seven years in prison for father who killed son

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News