Saturday, April 20, 2024

‘మురుగు’ కనుమరుగు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : 2 ఎంఎల్‌డి కెపాసిటీ గల లీచెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా మురుగునీరు శుభ్రం అవుతోందని, లీచెట్ ప్లాంట్‌కు సంబంధించిన ట్యాంకును నిర్ణీత సమయం ప్రకారం క్లీన్ చేయాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొంటూ ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేశారు. దీనికి సంబంధించి కెటిఆర్ షేర్ చేసిన ఫొటోలను మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ రీ ట్వీట్ చేస్తూ సమయం ప్రకారం దీనిని శుభ్రంగా ఉంచుతామని ఆయన రీ ట్వీట్ చేశారు.

లీచెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ అంటే…

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను జవహర్‌నగర్‌లోని డంప్ యార్డులో పడేస్తుండడంతో ఇక్కడ భారీగా చెత్తను నిల్వ అయ్యింది. దీంతో చుట్టు పక్కల ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో పారేసే చెత్తకు క్యాపింగ్ చేయడంతో పాటు బయో మైనింగ్ అండ్ బయో రెమిడియేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు జిహెచ్‌ఎంసీ టెండర్లు పిలిచింది. చెత్త క్యాపింగ్ కోసం రూ.140 కోట్లను వెచ్చించింది. ఇందులో 65 శాతం నిధులు జీహెచ్‌ఎంసీ, డంపింగ్ యార్డ్ ట్రీట్‌మెంట్ కాంట్రాక్టర్‌ను రాంకీ సంస్థలు భరించాయి. మిగిలిన నిధులను స్వచ్ఛ భారత్ పథకం కింద కేంద్రం విడుదల చేసింది. క్యాపింగ్ చేయడం వల్ల జవహర్ నగర్‌లో ప్రధాన సమస్య తీరిపోయింది. ఇక ఆ తర్వాత మురుగు నీటి శుద్ది కోసం లీచెట్ ప్లాంట్ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రోజుకు 2 ఎంఎల్‌డి కెపాసిటీ గల లీచెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను రాంకీ సంస్థ నిర్మించింది. దీని కోసం రూ.250 కోట్లను ఖర్చు చేసింది. ఈ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కావడంతో పాటు పని కూడా ప్రారంభించింది. రాంకీ సంస్థ నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా మురుగు నీరు అనుకున్న స్థాయిలో మురుగునీరు శుభ్రం అవుతోంది. ఈ నేపథ్యంలో లీచెట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఫొటోలను ఐటి,మున్సిపల్ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News