Home తాజా వార్తలు ఏడేళ్ల బాలికకు వృద్ధుడి లైంగిక వేధింపులు

ఏడేళ్ల బాలికకు వృద్ధుడి లైంగిక వేధింపులు

 Sexual abuse

 

మల్కాజిగిరి: ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన ఘటన రంగారెడ్డి జిల్లా నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. నేరేడ్‌మెట్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన హైదర్ అలియాస్ యూసఫ్ (74) అదే ప్రాంతానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు నిందుతుడిపై అత్యాచారం, ఫోక్సో కేసు నమోదు చేశారు. శుక్రవారం యూసఫ్‌ను అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం కోర్టుకు పంపారు.

Sexual abuse of sevenyearold Girl