Thursday, April 25, 2024

పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -
Sexual harassment of ten-year-old girl in old city
హైదరాబాద్ పాత బస్తీలో యువకుడిని చితకబాదిన స్థానికులు

మన తెలంగాణ/హైదరాబాద్: సైదాబాద్ సింగరేని కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన మరువక ముందే నగరంలోని పాతబ స్తీలో మంగళవారం నాడు మరో కీచకపర్వం వెలుగుచూసింది. పాతబస్తీలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు పదేళ్ల చిన్నారిపట్ల ఆసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు పట్టుకుని తాళ్లతో కట్టి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన 10 ఏళ్ల మైనర్ బాలిక ఆగస్టు 31వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ బాలికపై ఎప్పటి నుంచో కన్నేసిన ఓ యువకుడు ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిన ఆ మైనర్ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో తల్లి దండ్రులు మళ్లీ ఎపుడైనా ఎక్కడైనా అతడు కనిపిస్తే తమకు చెప్పాలని బాలికకు సూచించారు. ఈక్రమంలో మంగళవారం ఇంటి ముందు సైకిల్ తొక్కుతుతున్న బాలిక దగ్గరికి అదే యువకుడు వచ్చాడు. ఇదివరలో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి గుర్తించి వెంటనే బాలిక పెద్ద ఎత్తున కేకలు పెట్టింది. ఆ బాలిక కేకలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించింది ఇతనే అని చెప్పడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ యువకుడి రెండు చేతులు కట్టేసి దేహశుద్ది చేసిన అనంతరం ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న ఛత్రినాక పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న ముజీబుర్ రహమాన్(21) రక్షాపురంలో నివాసముంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గత నెల 31వ తేదీన తాగిన మైకంలో అలా ప్రవర్తించానని ముజీబుర్ రహమాన్ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. దీంతో రహమాన్‌పై ఫొక్సో చట్టం కింద ఛత్రినాక పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News