Home తాజా వార్తలు బిజెపి కార్యకర్తను హత్యచేసిన తీవ్రవాదులు

బిజెపి కార్యకర్తను హత్యచేసిన తీవ్రవాదులు

Terror-Attack

శ్రీనగర్ : బిజెపి కార్యకర్తను తీవ్రవాదులు చంపిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని రాఖీ ఈ లిట్టర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారం ప్రకారం… బుధవారం తెల్లవారుజామున బీజేపీ కార్యకర్త షబ్బీర్ అహ్మద్ భట్ నివాసంలోకి ఉగ్రవాదులు చొరబడి అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భట్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనా స్థలానికి బిజెపి కార్యకర్తలు భారీగా తరలి వచ్చి సంతాపం తెలిపి ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.