Home తాజా వార్తలు శ్రద్ధాకు ‘సాహో’ టీం బర్త్‌డే గిఫ్ట్…(వీడియో)

శ్రద్ధాకు ‘సాహో’ టీం బర్త్‌డే గిఫ్ట్…(వీడియో)

Shraddha Kapoorహైదరాబాద్: ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్టార్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ యాక్షన్ మూవీ ‘సాహో’ చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్ జోడించి హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవాళ(ఆదివారం) శ్రద్ధా పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ‘షేడ్స్ ఆఫ్ సాహో.. చాప్టర్ 2’ పేరుతో మూవీ చిత్రీకరణ సమయంలో తీసిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను తాజాగా విడుదల చేసింది. శ్రద్ధా తనదైన నటన, అభినయంతో ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఈసాన్ లాయ్ ఈ మూవీకి స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. విలన్ పాత్రల్లో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, జాకీష్రాఫ్, చుంకీపాండే కనిపించనున్నారు. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ కూడా మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 15న ‘సాహో’ రిలీజ్ కానుంది.

Shades Of Saaho2 is Released