Thursday, March 28, 2024

హత్య.. అందరూ రోడ్డు ప్రమాదం అనుకున్నారు…. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పట్టిచ్చింది

- Advertisement -
- Advertisement -

ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దానిని జనాలు అందరూ రోడ్ యాక్సిడెంట్ గా భావించి సంఘటనను మరచిపోయారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం దాటింది.. అయితే ఆ కనిపించని నాలుగో సింహం పోలీస్ మాత్రం దీనిని పసిగట్టింది. తప్పులు చేస్తే ఎవరు చూడరన్న హంతకుల ధీమాను పటాపంచలు చేసింది. హత్యాచేసీ చాకచక్యంగా తప్పించుకుంటామని హంతకులను పోలీసుల డేగ కన్ను మాత్రం వెంటాడి పట్టింది. చట్టం తన పని తాను చేసుకోపోతుంది.. ఎవరు ఊహించని రీతిలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు ఓ హత్య కేసులొ మిస్టరీని చేదించారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఈ వ్యవహారంలో షాద్ నగర్ ఏసిపి కుశాల్కర్ నేతృత్వంలో పట్టణ సీఐ నవీన్ కుమార్, క్రైమ్ విభాగం ఎస్ఐ వెంకటేశ్వర్లు, మరో ఎస్సై రాంబాబు ఇతర కానిస్టేబుళ్లు చాకచక్యంగా వ్యవహరించి నలుగురు నిందితులను అరెస్టు చేసి సోమవారము రిమాండ్ కు తరలించారు. సంచలనాత్మకమైన ఈ కేసు పూర్వపరాలను రంగారెడ్డి శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు షాద్ నగర్ పోలీసులను అభినందించి నగదు రివార్డులను కుడా అందజేశారు.

అసలేం జరిగింది అంటే…?

ఫిబ్రవరి 23 వ తేదీ 2021 వ సంవత్సరంలో ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ శివారులో బిక్షపతి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే అప్పట్లో 304 ఐపిసి సెక్షన్ కింద షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ తరువాత ఈ కేసులో కొన్ని అనుమానాలు రావడంతో పోలీసులు మెల్లగా కూపిలాగడం మొదలుపెట్టారు.

ఇలా ఘోరంగా హత్య చేశారు..

గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాలకు చెందిన బిక్షపతి అనే యువకుడు బోడ శ్రీకాంత్ వద్ద పనిచేసేవాడు. బిక్షపతికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. అయితే నిందితుడు బిక్షపతి హైదరాబాద్లో ఉంటూ ఓ దొంగ కంపెనీ పేరు మీద అమాయకులైన జనాలను డబ్బుల ఆశతో వారి పేర్ల మీద క్రెడిట్ కార్డులు తీసుకొని అందులోంచి డబ్బులు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించేవాడు. అతని వద్ద పనికి కుదిరిన మృతుడు బిక్షపతి పై అతని పేరు మీద ఐసిఐసిఐ బ్యాంకులో 50 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కట్టాడు. 2020లో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఆ ఇన్సూరెన్స్ కోసం నామినీగా శ్రీకాంత్ పేరు పెట్టుకున్నాడు. అదేవిధంగా 2021 లో గృహ రుణం కోసం 52 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మేడిపల్లి ప్రాంతంలో ఓ ఇల్లు కొని దాన్ని కూడా బిక్షపతి పేరుపై ఉంచాడు. ఆ తరువాత శ్రీకాంత్ కు డబ్బులు అవసరం ఉండి ఇల్లు అమ్మకానికి పెడితే దానికి బిక్షపతి ఒప్పుకోలేదు. శ్రీకాంత్ కు 2016 నుంచి మల్కాజిగిరి ఎస్ఓటి పోలీస్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మోతిలాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన సమస్యలు అతని వద్ద చెప్పుకోగా బిక్షపతిని అడ్డు తొలగిస్తే తనకు పది లక్షల రూపాయల నజరానా కావాలని కోరాడు. దీనికి ఓ పథకం ప్రకారం కుట్ర చేశారు. బిక్షపతిని చంపితే వచ్చే ఇన్సూరెన్స్ లో 30 లక్షలు శ్రీకాంత్, 5లక్షలు సమన్నకు మరో ఐదు లక్షలు చాగంటి సతీష్ కు ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం నలుగురు కలిసి ఫిబ్రవరి 23న 2021 సంవత్సరం మొగిలిగిద్ద వద్ద బిక్షపతికి మద్యం తాగించి అతన్ని హాకీ స్టిక్ తో కొట్టి చంపారు. ఆ తర్వాత రోడ్డుపై పడేసి ఫోర్డ్ ఎండీవర్ టీఎస్ 08 హెచ్ఎన్ 8368 తో అతని తొక్కించి దారుణంగా చంపారు.

ఇన్సూరెన్స్ నామిని పై అనుమానాలు

బిక్షపతిని హత్య చేసిన అనంతరం అతనిపై ఉన్న 50 లక్షల ఇన్సూరెన్స్ విషయంలో కంపెనీకి అనుమానాలు ఉన్నాయి. బిక్షపతికి అమ్మ నాన్న లేరు. బంధువులు కుడా తెలీదు.. ఎవరూ లేకుండా అతనికి నామినీగా శ్రీకాంత్ ఉండడం గమనార్హం. ఏలాంటి సంబంధం లేకుండా శ్రీకాంత్ ఎలా నామిని అయ్యాడనే అనుమానాలు ఇన్సూరెన్స్ కంపెనీ వర్గాలు పోలీసులకు తెలిపాయి. అదేవిధంగా మేడిపల్లి ప్రాంతంలో కొన్న ఇల్లు కూడా ఇన్సూరెన్స్ చేయించారు. అన్నిట్లో నామినీ గా శ్రీకాంత్ ఉన్నాడు. అసలు ఈ వ్యవహారం మొదటి నుంచి అనుమానంగానే ఉండడంతో షాద్ నగర్ పోలీసులకు కేసులో అనుమానం వచ్చింది. ఏసిపి కుశాల్కర్ నేతృత్వంలో పట్టణ సీఐ నవీన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, మరో ఎస్సై రాంబాబు తదితర పోలీస్ సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి కేసులో పూర్తి సాక్ష్యాలను సేకరించారు.

సిబ్బందిని అభినందించిన డిసిపి జగదీశ్వర్ రెడ్డి

షాద్ నగర్ ఎసిపి కుశాల్కర్ నేతృత్వంలో కేసులో మిస్టరీని ఛేదించిన సీఐ నవీన్ కుమార్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రాంబాబు, కానిస్టేబుల్ రవి, రమేశ్, మోహన్, హోంగార్డు రఫీ తదితర సిబ్బందిని నగదు బహుమతితో అభినందించారు. కేసులో ఎంతో పరిణితి కనబరిచి నలుగురు హంతకులను పట్టుకోవడంపై అభినందించారు. తప్పుచేసి చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని డిసిపి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

శ్రీకాంత్ పాత నేరస్తుడు

నిందితుడు శ్రీకాంత్ హైదరాబాద్ లో ఉంటూ దొంగ కంపెనీ పేరు మీద అమాయకులైన జనాలను డబ్బుల ఆశతో హైదరాబాద్ పిలిపించుకొని వారిని తన దొంగ కంపెనీలో ఉద్యోగులుగా సృష్టించి, వారి పేర్ల మీద క్రెడిట్ కార్డులు తీసుకొని అందులోంచి డబ్బులు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అతని దగ్గర సతీష్ డ్రైవరుగా సమ్మన్న, సతీష్ పని చేసేవారు. శ్రీకాంత్ కి అన్నీ పనులు చేసేవాళ్లు. 2022 జూన్ నెలలో నాచారం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 258 2022 లో 420 కేసు నమోదు అయింది. అక్కడ రాచకొండ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి వీరి అక్రమాలను గతంలో మీడియాకు కూడా తెలిపారు. శ్రీకాంత్ వద్ద పనిచేస్తున్న బిక్షపతి తల్లిదండ్రులు ఎవరూ లేరని ఊహించి అతనిపై ఇన్సూరెన్స్ చేయించి హత్యకు కుట్రపన్ని ఇలా షాద్ నగర్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News