Thursday, March 28, 2024

షెఫాలీకి అరుదైన ఛాన్స్

- Advertisement -
- Advertisement -

shafali verma

 

ముంబై: భారత యువ సంచలనం, స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ అరుదైన ఛాన్స్‌ను కొట్టేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో షెఫాలీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు మ్యాచుల్లో ఏకంగా 161 పరుగులు సాధించి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇక, షెఫాలీ ప్రతిభను గుర్తించిన ప్రముఖ శీతల పానియాల సంస్థ పెప్సీ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నియమించింది. ప్రపంచంలోని ప్రముఖ ఉత్పత్తుల్లో పెప్సీ ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక, క్రికెట్‌లో అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న షెఫాలీను తమ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించాలని పెప్సీ సంస్థ నిర్ణయించింది. ఈ విషయాన్ని పెప్సీ అధికారులు ఒక ప్రకటనలో అధికారికంగా ప్రకటించారు.

యువ క్రికెటర్‌కు తమవంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించారు. కాగా, షెఫాలీ ఏడాది క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టింది. అతి తక్కువ సమయంలోనే భారత జట్టులో కీలక క్రికెటర్‌గా ఎదిగింది. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తిస్తోంది. ప్రపంచకప్‌లోనూ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఇటీవలే మహిళల టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మకమైన పెప్సీ సంస్థకు ప్రచారకర్తగా ఎంపికైంది. ఇదిలావుండగా పెప్సీ సంస్థ బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపిక కావడంపై షెఫాలీ ఆనందం వ్యక్తం తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాననే ధీమాను వ్యక్తం చేసింది.

shafali verma is as pepsi company brand ambassador
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News