Home తాజా వార్తలు ‘జీరో’ కాడు హీరో…(ట్రైలర్)

‘జీరో’ కాడు హీరో…(ట్రైలర్)

Shah Rukh Khan's Zero

ముంబయి: బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘జీరో’. షారూక్ బర్త్ డే సందర్భంగా మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జుగా నటిస్తున్నాడు. పాతికేళ్ల తన సినీ కెరీర్‌లో ఈ బాలీవుడ్ బాద్ షా తొలిసారి మరుగుజ్జు పాత్రలో నటిస్తుండటం విశేషం. షారూఖ్‌కు జోడీగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్ నటిస్తున్నారు. అనుష్క శర్మ మానసిక దివ్యాంగురాలి పాత్రలో క‌నిపించగా, కత్రినా సూపర్ స్టార్ పాత్రలో మెరిసింది. ట్రైలర్‌లో షారూక్, అనుష్కా శర్మ తమ నటనతో ఆకట్టుకున్నారు. కత్రినా తన అందాలతో కనువిందు చేసింది. షారూఖ్ సతీమణి గౌరీ ఖాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్టమస్ కానుకగా 2018 డిసెంబర్ 21న మూవీ విడుదల కానుంది.

Shah Rukh Khan Zero Official Trailer Released

Telangana Breaking News