Friday, March 29, 2024

దుబాయ్‌లో షారూఖ్ ఖాన్ విల్లా గురించి తెలుసా?

- Advertisement -
- Advertisement -

Shahrukh villa
ముంబయి: ఒకప్పుడు దూరదర్శన్ టివిలో ‘సర్కస్’అనే సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ ఖాన్ అనతి కాలంలోనే పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడయ్యాడు. చాలా మంది అతడిని బాలీవుడ్ బాద్‌షా అని కూడా పిలుస్తుంటారు.ముంబయిలో అతడికున్న ఇల్లు ‘మన్నత్’ దాదాపు రూ. 200 కోట్లపైనే ఉంటుందట. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా అంటుంటారు. కాగా దుబాయ్‌లో ఓ ప్రైవేట్ ద్వీపకల్పంలో కూడా అతడికో మంచి విల్లా ఉందట. దాని ఖరీదు దాదాపు రూ.18 కోట్లు ఉంటుందంటున్నారు. ఆ విల్లాకు ‘జన్నత్’ అని పేరు పెట్టుకున్నాడట. దాని విస్తీర్ణం 85000 చదరపు అడుగులు. కృత్రిమ ద్వీపసమూహంగా చెప్పుకునే పామ్ జుమేరాలో ఈ విల్లా ఉంది. ఇందులో ఆరు బెడ్‌రూమ్‌లు, రెండు రిమోట్ కంట్రోల్డ్ గ్యారేజ్‌లు, ప్రైవేట్ పూల్, చేపలు పట్టేందుకు వీలుగా ఉండే బీచ్ వంటి హంగులనీ ఉన్నాయి. ప్రస్తుతం అనేక విధాల సమస్యలతో టెన్షన్ ఎదుర్కొంటున్న షారూఖ్ త్వరలో ‘పఠాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో హీరోయిన్ దీపిక పదుకోణె.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News