Home తాజా వార్తలు ప్రతిదాని వెనుక ఓ కష్టముంటుంది

ప్రతిదాని వెనుక ఓ కష్టముంటుంది

Shailaja Reddy Alludu Official Trailer

నాగచైతన్య, అను ఇమాన్యుయల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. “నా పేరు చైతన్య. ముద్దుగా అందరూ చైతు అంటారు. దేనినైనా పాజిటివ్‌గా తీసుకునే సాఫ్ట్ క్యాండిడేట్‌ని. మనం లైఫ్‌లో ప్రేమించే ప్రతిదాని వెనుక ఓ కష్టముంటుంది. కానీ అది తట్టుకోగలిగితే లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది” అంటూ నాగచైతన్య తనను తాను పరిచయం చేసుకోవడంతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో చైతన్య నాన్న పాత్రలో మురళీశర్మ, అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించారు. చైతూ ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిషోర్, శైలజా రెడ్డి భర్త పాత్రలో సీనియర్ నరేష్, శైలజారెడ్డి సెక్రటరీ పాత్రలో పృథ్వీ నటించారు. సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని తెలియజేసేవిధంగా ట్రైలర్‌లో రొమాన్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ అన్నీ కవర్ చేశారు. ట్రైలర్ చివరలో ‘ప్రియరాగాలే…’ సాంగ్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అంతా పర్‌ఫెక్ట్‌గా ఉంది. ఇక దర్శకుడు మారుతి చేసిన మ్యాజిక్ గురించి తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందేనని అంటున్నారు ఫిల్మ్‌మేకర్స్.