Home Default ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: మయాంక్, షమీలకు కెరీర్ బెస్ట్..

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: మయాంక్, షమీలకు కెరీర్ బెస్ట్..

 

దుబాయ్‌: వరుస టెస్టు సిరీస్ ల విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పట్టికలో 300 పాయింట్లు సాధించి ఏ జట్టుకు అందనంతా ఎత్తులో నిలిచింది. తాజాగా ఐసిసి విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. టెస్టు ర్యాంకింగ్స్ లో తొలిసారి మహ్మద్ షమీ టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. గత కొద్దిరోజులుగా టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న షమీ 790 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇక, భారత్ యంగ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా 802 పాయింట్లతో నాలుడో ర్యాంకులో కొనసాగుతుండగా.. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 780 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. ఇక, అగ్రస్థానంలో ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా బౌలర్ రబడా, విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ లు ఉన్నారు.

ఇక, బ్యాటింగ్ లో ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో నిలబెట్టుకున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ ఏడో స్థానంలో ఉన్నాడు. తాజా టెస్టు సిరీస్ లో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్ 691 పాయింట్లతో 11వ ర్యాంక్ కు ఎగబాకాడు. ఆల్ రౌండర్లలో టీమిండియా సీనియర్ స్పీన్నర్లు రవీంద్ర జడేజా రెండో స్థానంలో నిలువగా.. అశ్విన్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో జాసన్ హోల్డర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

Shami, Mayank gets best in ICC Test Rankings