Tuesday, April 16, 2024

ఇద్దరూ ఇద్దరే..

- Advertisement -
- Advertisement -

kohli

 

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, వెస్టిండీస్ దిగ్గజం వివిఎన్ రిచర్డ్‌పై ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో వీరిని మించిన బ్యాట్స్‌మెన్ మరోకరూ లేరని పేర్కొన్నాడు. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌లో రిచర్డ్‌ను మించిన బ్యాట్స్‌మన్ ఉన్నాడా అనిపించేదన్నాడు. అయితే కోహ్లి రాకతో తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందన్నాడు. ప్రపంచ క్రికెట్‌పై ఇద్దరు తమదైన ముద్ర వేశారన్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌కు రిచర్డ్ మరో పేరు అయితే, నిలకడైన ఆటకు కోహ్లి నిదర్శనంగా నిలుస్తాడని ప్రశంసించాడు. ఇక, ప్రస్తుత క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మెన్ అనడంలో సందేహం లేదన్నాడు.

 

Shane Warne applauds Virat Kohli and VVN Richard
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News