Wednesday, April 24, 2024

మద్యం మత్తులో టిక్‌టాక్ స్టార్

- Advertisement -
- Advertisement -

Shanmukha Jashwant arrested for driving under influence of Alcohol

 

మత్తులో కారు నడిపిన షణ్ముక్
రెండు కార్లు, రెండు బైక్‌లు ధ్వంసం

మనతెలంగాణ, పంజాగుట్ట : మద్యం మత్తులో టిక్‌టాక్ స్టార్ కారు నడిపి వాహనాలను ఢీకొట్టిన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన టిక్‌టాక్ స్టార్, షార్ట్‌ఫిల్మ్ యాక్టర్ షణ్ముఖ జశ్వంత్ మద్యం తాగి కారును నడుపుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. మద్యం మత్తులో కారును ఇష్టం వచ్చినట్లు నడపడంతో రోడ్డు నంబర్ 10పైన వెళ్తున్న రెండు కార్లు, రెండు బైక్‌లను ఢీకొట్టాడు. ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసం కావడంతోపాటు, ట్రాఫిక్ జాం ఏర్పడింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు తీవ్రంగా గాయపడిన ద్విచక్ర వాహనదారుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మద్యం తాగి వాహనం నడిపిన షణ్ముఖ జశ్వంత్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News