Home నల్లగొండ బోరుబావిలో పడిన శాన్వి మృతి

బోరుబావిలో పడిన శాన్వి మృతి

shanvi1

12 గంటల పాటు తవ్వకం పనులు
మంగళవారం తెల్లవారు జామున పాప వెలికితీత 

మన తెలంగాణ/కేతేపల్లి(శాలిగౌరారం) : శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని కట్టగూరి అంజయ్య నిమ్మతోటలోని బోరుబావిలో పడిన రెండు సంవత్సరాల పాప శాన్వి మృతిచెందింది. సోమవారం మధ్యాహ్నం మూడు న్నర గంటల సమయంలో బోరుబావిలో పడిన శాన్విని రక్షించేందుకు పోలీ సులు, 108, రెవెన్యూ, రిస్కూటీంలు చేసిన కృషికి ఫలితం దక్కకపో వడంతో అందరు దిగ్భ్రాంతికి గురై కన్నీళ్ళు పెట్టారు. 12 గంటల పాటు ఏకతాటిగా తవ్వకం పనులు చేసినప్పటికీ చివరకు పాప ప్రాణాలతో దక్కకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు శోఖసంద్రంలో మునిగిపోయారు. బోరుబావిలో పడ్డ చిన్నారిని వెలికితీసేందుకు భారీ ప్రోక్లేయిన్ సహాయంతో 24 అడుగుల లోతు బోరుకు సమాంతరంగా గుంత తవ్వారు. చివరి 5 ఫీట్లు గుంత తవ్వ డానికి బండరాళ్ళు అడ్డురావడం వల్ల వాటిని తొలగించేందుకు సుమారు 8 గంటల సమయం పట్టింది. శాన్వి ప్రాణాలతో బయటకు వస్తుందన్న నమ్మ కంతో ఉన్న 108 సిబ్బంది తక్షణ చికిత్స అందించేందుకు అవసరమగు ఏర్పా ట్లు సిద్దం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3:35 నిమిషాలకు పాపను బోరుబావి నుంచి అధికారులు వెలికితీశారు. విగతజీవిగా పడిఉన్న పాపను తల్లిదండ్రులు గుండెలకత్తుకొని బోరున విలపిస్తూ మాట్లాడమని, క ళ్ళు తెరవమని వినిపిస్తున్న పలకరింపులకు అందరి హృదయాలు చలింపవే శాయి. అక్కడున్న అధికారులతో పాటు భారీ సంఖ్యలో వచ్చిన గ్రామస్తులు, బంధువులు కన్నీళ్ళ పర్యంతమయ్యారు. పాపను వెలికితీతతో మృతిచెంది ఉండవచ్చని భావించినప్పటికీ తక్షణం చికిత్స అందించేందుకు 108 వాహ నంలో నకిరెకల్ ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పాపను పరిశీలించిన వైద్యులు మృతిచెందిందని నిర్ధారించారు. అనంతరం పాపను తల్లిదండ్రులకు అప్పగించడంతో వారి స్వగ్రామమైన నల్లగొండ మండలం దీపకుంటకు తీసుకువెళ్ళారు. తవ్వకం పనులు ప్రారంభం నుంచి చివరివరకు నల్లగొండ డిఎస్పీ సుధాకర్, జడ్పి సిఈఓ మహేందర్‌రెడ్డ్డి, ఆర్‌డిఓ శ్రీని వాసరెడ్డి, సిఐ ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వర్‌రావు,రవీందర్, తహశీల్ధార్లు రైసో ద్దిన్, హనుమనాయక్, ఆరుగురు ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.