Home జాతీయ వార్తలు ఎన్ సిపి ఎంఎల్ఎలతో శరద్ పవార్ భేటీ

ఎన్ సిపి ఎంఎల్ఎలతో శరద్ పవార్ భేటీ

Sharad Pawarముంబయి : మహారాష్ట్రలో రాజకీయం క్షణం క్షణం మారుతున్నాయి. శనివారం బిజెపి, ఎన్ సిపి శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బిజెపి నేతలు ఎన్ సిపి నేత అజిత్ పవార్‌ను మభ్యపెట్టారని, బిజెపి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని  ఎన్ సిపి, శివసేన, కాంగ్రెస్ లు పేర్కొన్నాయి. గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ రాజ్యాంగానికి విరుద్దంగా, బిజెపి కోవర్టుగా మారారని, అతనిపై, బిజెపిపై చర్యలు తీసుకోవాలని శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇదిలా ఉండగా తమ పార్టీ ఎంఎల్ఎలను కాపాడుకునేందుకు ఎన్ సిపి వారిని ముంబయిలోని లలిత్ హోటల్ లో ఉంచింది. ఆదివారం సాయంత్రం వారితో ఎన్ సిపి అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. మహారాష్ట్రలో తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఎంఎల్ఎలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శరద్ పవార్ హామీ ఇచ్చారు. శరద్ పవార్ తో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కూడా ఎన్ సిపి ఎంఎల్ఎలతో మాట్లాడారు. ఈ సందర్భంగా శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే ఏకాంతంగా సమావేశమై, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. 

Sharad Pawar Meets NCP MLAs