Home ఆఫ్ బీట్ బాడీషేమింగ్ జోకా..!

బాడీషేమింగ్ జోకా..!

BJP Leader Vasundhara Raje Scindia

 

స్త్రీలు ఏరంగంలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ప్రత్యర్థుల నుంచి వ్యక్తిగత దూషణలు వినాల్సి వస్తుంది. నిజానికి విషయం లేనివారు మాత్రమే వ్యక్తిగత దూషణలకు దిగుతారు. సమాజంలో విశిష్టస్థానంలో ఉండి కూడా దిగజారి మాట్లాడటం వల్ల మహిళల పట్ల వాళ్ల దృక్పథం ఏమిటో స్పష్టంగా అర్థమౌతుంది. ఈ మధ్య రాజస్థాన్ ఎన్నికల్లో బిజెపి నేత వసుంధరరాజే సింధియాపై సీనియర్ నాయకుడు శరద్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవకే వస్తాయి.

వసుంధర రాజే బరువు పెరుగుతున్నందున ఇక విశ్రాంతి తీసుకోవాలని శరద్‌యాదవ్ సూచించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. యాదవ్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆయన నాలుక్కరుచుకున్నారు. వెంటనే తన మాటల్ని తప్పుగా తీసుకోవద్దంటూ..ఆ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాల్సిన పనిలేదని తాను కేవలం జోక్ చేసినట్లు సరిదిద్దుకున్నాడు. తన శరీర ఆకృతిపై చేయకూడని వ్యాఖ్యలు చేసి తనను అవమానించిన శరద్ యాదవ్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వసుంధరరాజే డిమాండ్ చేయడం తెలిసిన విషయమే. మహిళలను ఇలా కించపరచడం ఇదేం కొత్తకాదు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయనాయకుల కామెంట్లు చేయడం ఎప్పటినుంచో ఉంది.ఒక వ్యక్తి శరీరం మీద సన్నం, లావు, పొడవు, పొట్టి, తెలుపు, నలుపు అంటూ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం నేరం కూడా. మరి ఈ విషయం ఇలాంటి పెద్దమనుషులకు తెలియదేమో! ఇకనైనా మహిళల్ని గౌరవించడం కనీస బాధ్యతగా గుర్తిస్తారని ఆశిద్దాం..

Sharad Yadav Remarks On Vasundhara Raje Scindia

Telangana Latest News