Home తాజా వార్తలు ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Shares of Muthoot Finance fall after chairman death

 

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎక్కడి సూచీలు అక్కడే అన్నట్టుగా ముగిశాయి. ప్రారంభంలో భారీ లాభాలతో పయనించిన మార్కెట్లు ఆఖరికి స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు కోల్పోయి 50,441 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 14,956 పాయింట్ల వద్ద ముగిసింది. బలహీన అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ పరిస్థితులు మార్కెట్లను ముందుకు నడిపించ లేకపోయాయి. ఎల్ అండ్ టి, ఒఎన్‌జిసి, హెచ్‌సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టిపిసి, ఎస్‌బిఐలు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌యుఎల్‌లు నష్టపోయాయి.

చైర్మన్ మృతి తర్వాత ముత్తూట్ షేర్లు పతనం
గత కొద్ది రోజులుగా ముత్తూట్ ఫైనాన్స్ షేరు పతనమవుతూ వస్తున్నాయి. రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో సంస్థ గ్రూప్ చైర్మన్ ఎంజి జార్జ్ ముత్తూట్ నాలుగు అంతస్తుల భవంతి నుంచి కిందపడి కన్నుమూశారు. ఆయన మృతి తర్వాత స్టాక్‌మార్కెట్లు కంపెనీ షేర్లు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి.

Shares of Muthoot Finance fall after chairman death