Tuesday, April 23, 2024

షార్క్ చేపలకు ప్లాస్టిక్ షాక్

- Advertisement -
- Advertisement -

కొన్నివేల సంవత్సరాల నుంచి సముద్రంలో జీవిస్తున్న షార్క్ చేపలు ప్లాస్టిక్ వ్యర్థాల ఊబిలో చిక్కుకుని అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యంతోపాటు వేటగాళ్ల బెడద వాటి పాలిట ప్రాణాంతకమౌతున్నాయి. మధ్యధరా సముద్రంలో సగం కన్నా ఎక్కువగా షార్క్ , రే చేపలు ప్రమాదం అంచున ఉన్నాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్లుడబ్లుఎఫ్) హెచ్చరిస్తోంది. ఈ రకం చేపలు మూడొంతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది.

అన్ని దేశాల కన్నా లిబియా, టునీషియా, దేశాల్లో షార్క్ చేపల వేట అధికంగా ఉంటోంది. ఏటా 4200 టన్నుల షార్క్ చేపలు వేటకు బలవుతున్నాయని , ఇటలీ తరువాత మధ్యధరా సముద్రంలో ఈ రెండు దేశాలు రే చేపల వేటలో ముందుంటున్నాయని నివేదికలో వివరించింది. కొన్ని చేపలను కేవలం ఆహారం కోసమే వేటాడుతుండగా, మధ్యధరా సముద్రంలో మాత్రం ఇతర చేపల వేటకు ఎరగా షార్క్ చేపలను ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా 60 రకాల షార్క్ చేపల రకాలు ఎరగా బలైపోయాయని నివేదికలో హెచ్చరించింది. 400 మిలియన్ సంవత్సరాల కన్నా ముందునుంచి షార్క్ చేపలు సముద్రజలాల్లో మనుగడ సాగిస్తున్నాయి. ఇవి చాలా మెల్లగా ఎదుగుతుంటాయి.

సంతానోత్పత్తి కూడా ఆలస్యమౌతుంది. షార్క్ తెగలు 79, రే చేపత తెగలు 120 ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్స్‌టెర్ పరిశోధకులు వెయ్యికి మించి షార్క్ చేపల తెగలు ప్లాస్టిక్ లో చిక్కుకుంటున్నాయని అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. తిమింగలాలు, తెల్లషార్క్‌లు, టైగర్ షార్క్‌లు తదితర 559 షార్కు తెగలు ప్లాస్టిక్ చిక్కుల్లో ఇరుక్కుంటున్నాయని చెబుతున్నారు. వాతావరణ ప్రభావం మత్స జాతులపై పడుతున్నాయి. తీర ప్రాంతం పొడవునా పారిశ్రామిక, వ్యవసాయ, ప్లాస్టిక్ అవశేషాలు మత్ససంపదకు ప్రాణగండంగా తయారయ్యాయి. నదుల్లోకి భారీ ఎత్తున వ్యర్థాలు వచ్చి పడుతుండడంతో కాలుష్య కారకాలు పెరిగిపోతున్నాయి. ప్రధాన మంత్రి మత్స సంపద యోజన ( పిఎంఎంఎస్‌వై) పథకం ప్రవేశ పెట్టిన తరువాత భారత్‌లో మత్యసంపద కాస్త పెరుగుతున్నా మరో వైపు ప్లాస్టిక్ కాలుష్యాలు, వేటగాళ్ల వేటలు సాగుతుండడంతో తరిగిపోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News