Wednesday, April 24, 2024

హుజూరాబాద్ లో ర్యాలీలు, రోడ్ షోలు బంద్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించి నవంబర్ 2 పలితాలు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. ”నిబంధనలు ఏవిధంగా తీసుకోవాలని అనే దానిపై సూచనలు చేశారు. నామినేషన్ సంబంధించి ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించాలి. స్టార్ క్యాంపైనర్ లిస్ట్ కూడా కుదించారు. రోడ్ షోలు, మోటార్ ర్యాలీలకు అనుమతి లేదు. ఇంటింటికీ ప్రచారంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి. పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలి.

 వెహికిల్ లో కూడా పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలు పాటించాలి. కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశాం. ప్రతి ఒక్కరు కేంద్ర ఎన్నికల నిబంధనలు పాటించాలి. అధికారులు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు పరిశీలించాం. మొత్తం 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 47 పోలింగ్ కేంద్రాల్లో 1000 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తాం. మొత్తం 2,36,430 ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కోవిడ్ పేషేంట్ లకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం. ఓటరలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి. కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారు పోలింగ్ వారం ముందు వరకు నమోదు చేసుకోవచ్చు. ఆన్ గోయింగ్ ప్రభుత్వ పథకాలు యధావిధిగా కొనసాగుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కూడా త్వరలోనే ఉంటుంది. మిగత రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు” అని వివరించారు.

Shashank Goyal about Huzurabad by Poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News