Home జాతీయ వార్తలు శశిథరూర్‌కు బెయిల్ మంజూరు

శశిథరూర్‌కు బెయిల్ మంజూరు

Shashi Tharoor Granted Anticipatory Bail in Sunanda Death Case

ఢిల్లీ : సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడి బెయిల్‌ను మంజూరు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై గురువారం విచారణ చేసింది. అనంతరం లక్ష రూపాయల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం వదిలి వెళ్లొద్దని కోర్టు ఆయన్ను ఆదేశించింది.

Shashi Tharoor Granted Anticipatory Bail in Sunanda Death Case