Home తాజా వార్తలు క్యాస్టింగ్‌ కౌచ్‌పై సిన్హా సంచలన వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌పై సిన్హా సంచలన వ్యాఖ్యలు

Sinha

డిల్లీ: గత కొంత కాలంగా టాలీవుడ్, బాలీవుడ్ లలో క్యాస్టింగ్ కౌచ్ రచ్చగా మారింది.  ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు  కూడా ఈ అంశంపై మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమకే కాదు, ప్రతిచోటా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సైతం అందుకు మినహాయింపు కాదన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, భాజపా నేత శత్రుఘ్న సిన్హా కూడా క్యాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయంపై మరింత వేడి రాజుకుంది. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ.. ”లైంగిక ఆనందాలు, లైంగిక దోపిడీ అనేది అటు వినోదాత్మక రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఉందన్నారు. ఈ విషయంలో సరోజ్ ఖాన్, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు నిజాలేనని చెప్పారు.

చాలా రోజుల నుంచి ఉన్న పద్ధతేనని, జీవితంలో ముందుకెళ్లాలంటే కొన్ని సార్లు సమయం డిమాండ్ చేసినట్లుగా నడుచుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. సరోజ్ ఖాన్ చాలా గొప్ప కొరియోగ్రాఫర్ అని,  దాదాపు ఆమె అందరితోనూ కలిసి పని చేశారని తెలిపారు. బాలీవుడ్ లో లైంగిక దోపిడి గురించి ఖాన్ పెదవి విప్పరంటే, దాని గురించి ఆమెకు తెలిసే ఉంటుందన్నారు. సినిమాల్లోకి అమ్మాయిలు రావడానికి ఎలా రాజీ పడాల్సి వస్తుందో తనకు తెలుసునన్నారు. ఆమె మాటాలను తాను పూర్తిగా అంగీకరిస్తున్నానని సిన్హా అన్నారు. అంతే  కాకుండా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై కూడా తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాల్లో దీన్ని ఏమనాలో తనకు తెలియదన్నారు. క్యాస్టింగ్- ఓట్ కౌచ్ అని అనాలేమో అని ఆయన చెప్పార. అయితే ఇది సరైనదేనని తాను అననని చెప్పాడు.

ఇలాంటివి తనకు ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. అయితే  మన చుట్టూ ఏం జరుగుతుందో ముందు మనం తెలుసుకోగలం కదా..? అందుకే సరోజ్, రేణుక వ్యాఖ్యలను ఖండించకండని ఆయన కోరారు. అలాంటి వాతావరణానికి సంబంధించిన పరిస్థితులను మాత్రం ఖండించండని శత్రుఘ్న సిన్హా అన్నారు. తెలుగు నటి శ్రీరెడ్డి వివాదం సందర్భంగా బాలీవుడ్ కొరియోగ్రాపర్ సరోజ్ ఖాన్ క్యాస్టింగ్ కౌచ్ పై ఈ మద్య కాలంలో స్పందించిన విషయం విదితమే. లైంగిక దోపిడీతో చిత్రసీమలో కనీసం ఉద్యోగాలు  దొరుకుతున్నాయని, ఇతర రంగాల తరహాలో ఇక్కడ అత్యాచారానికి తెగబడి మహిళలను వదిలేయడం లేదని ఆమె వ్యాఖ్యనించారు. ”లైంగిక దోపిడీ అనాదిగా వస్తున్న వ్యవహారమేనన్నారు. అమ్మాయితో సుఖం పొందాలని ప్రతి ఒక్కరూ చూస్తారని, ప్రభుత్వ ఉద్యోగులు సైతం అందులో ఉండటం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఒక్క సినీ రంగాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు..? ఇక్కడ కనీసం ఉపాధి కల్పిస్తున్నారు. అత్యాచారం చేసి వదిలేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వలలో చిక్కుకోవాలా..? వద్దా..? అనేది అమ్మాయిలా చేతిలోనే ఉందని సరోజ్ ఖాన్ తేల్చి చెప్పారు.