Saturday, April 20, 2024

ప్రేమ.. సహజీవనం… ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

- Advertisement -
- Advertisement -

love couple attempt suicide in hyderabad

వరంగల్: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఆమెతో గత ఐదు సంవత్సరాల నుంచి సహజీవనం చేశాడు. చివరగా పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ప్రియుడ్ని కోరడంతో అతడు నిరాకరించాడు. దీంతో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పరపల్లికి చెంది ఆరెళ్లి కిరణ్ అనే ప్రైవేటు ఉద్యోగి వరంగల్‌లోని కీర్తినగర్‌లో తన అన్న ఇంట్లో ఉంటున్నాడు. అక్కడ పవిత్ర అనే అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేయడం సాగించాడు. ఆమె పలుమార్లు పెళ్లి ప్రస్తావనం తెచ్చినప్పుడల్లా తరువాత చేసుకుందామని సమాధానం చెప్పేవాడు. ఒక రోజు ఆమె పెళ్లి చేసుకోవాలని అతడిని నిలదీసింది. పెళ్లి చేసుకోవడం కుదరదని, తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని తేల్చి చెప్పి తన సొంతూరుకు వెళ్లిపోయాడు. వెంటనే పవిత్ర ఉప్పరపల్లికి చేరుకొని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. వెంటనే యువతి ధర్నాకు ఎంఎస్‌ఎఫ్ ఇన్‌ఛార్జ్ రాజశేఖర్, పలు మహిళా సంఘాలు, ఎంఆర్‌పిఎస్ నాయకులు మద్దతు పలికారు. కిరణ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News