Home జాతీయ వార్తలు మూడు ఎగ్స్‌కు రూ. 1672 బిల్లు

మూడు ఎగ్స్‌కు రూ. 1672 బిల్లు

 

గాంధీనగర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ హోటల్ మూడు గుడ్లకు 1672 బిల్లు వేసి కస్టమర్ చేతిలో పెట్టారు. దీంతో కస్టమర్ ఆశ్చర్యపోయాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ రావిజియాన్ అహ్మదాబాద్‌లోని హయత్ రెజిన్సీ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశాడు. మూడు గుడ్లు ఆర్డర్ ద్వారా తెప్పించుకున్నాడు. హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మూడు గుడ్లకు రేటు చూసి అవాక్కయ్యాడు. మూడు గుడ్ల రేటు అక్షరాల జిఎస్‌టితో కలిపి రూ. 1672 బిల్లు వేశారు. చేసేదేమీ లేక ఆ బిల్లు మొత్తాన్ని చెల్లించి, బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టును మూడు వేల మంది లైక్ చేయగా ఏడు వందల మంది షేర్ చేయగా వెయ్యి మంది రిప్లై ఇచ్చారు. గతంలో ఛండీగఢ్‌లోని మారియట్ హోటల్ వాళ్లు రెండు అరటి పండ్లకు 442.50 బిల్లు వేసిన విషయం తెలిసిందే.

 
Shekhar Ravijianii shocked after Rs 1,672 for 3 eggs,Internet has the best jokes for the bizarre situation,singer and composer said that he was exorbitantly

 

 

 

 

 

Shekhar Ravijianii shocked after Rs 1,672 for 3 eggs