Home తాజా వార్తలు ధోనిపై కాట్రెల్ ఫిదా

ధోనిపై కాట్రెల్ ఫిదా

Cottrell-salutesన్యూఢిల్లీ: వికెట్లు పడితే సెల్యూట్ చేస్తూ సంబరాలు చేసే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. సైన్యంలో పనిచేసి విండీస్ జట్టులోకి అడుగుపెట్టిన కాట్రెల్ వికెట్లు తీస్తే సైన్యానికి గౌరవ సూచికగా కవాతు చేస్తూ సెల్యూట్ చేస్తాడు. అతను పాటించే సంప్రదాయానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. తాజాగా టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిపై అతను చేసిన కామెంట్ అభిమానులను ఆకట్టుకుంది.

క్రికెట్‌కు విరామం ప్రకటించి రెండు నెలలు పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాలని ధోని తీసుకున్న నిర్ణయాన్ని కాట్రెట్ కొనియాడాడు. భారత ఆర్మీపై ధోనీకి ఉన్న అంకితభావం తనకి ఎంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు. ‘మైదానంలో ధోనీ ఎంతో స్ఫూర్తినిస్తాడు. అతను గొప్ప దేశభక్తుడు కూడా. దేశానికి సేవ చేయాలని అతనికి ఉన్న అంకితభావం అమోఘం. గత కొన్ని వారాలుగా నేను మా ఆటగాళ్లతో ఉన్నాను.’అని కాట్రెల్ ట్వీట్ చేశాడు.

Sheldon Cottrell Salutes to MS Dhoni