Home తాజా వార్తలు వర్మపై బాలీవుడ్ హీరోయిన్ గుస్సా

వర్మపై బాలీవుడ్ హీరోయిన్ గుస్సా

Sherlyn-Chopraముంబయి: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై గుస్సా అయింది. ఒక అడల్ట్ సిన్మాను కొన్నేళ్ల క్రితం ఆర్జీవీ తనకు ఆఫర్ చేశాడని షెర్లిన్ పేర్కొంది. తాజాగా ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ… 2016లో తన చిత్రంలో ఒక చాన్స్ ఇవ్వాలంటూ వర్మకు తన ఫొటోస్ ను పంపించానని తెలిపింది. తర్వాత వర్మ తనకు ఒక స్క్రిప్ట్ పంపించారని, అందులో మొత్తం బెడ్ సీన్లే ఉన్నాయంది. అసభ్యకరమైన సన్నివేశాలపై ఆర్జీవీని తాను ప్రశ్నించగా, దానికి సమాదానంగా వర్మ అడల్ట్ సినిమాల్లో నటిస్తే సన్నీ లియోన్ మాదిరిగా గొప్ప స్టార్ అవుతావని చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ సందర్భంగా ఆయనకు తాను ధీటుగా సమాధానమిచ్చానని చెప్పింది. బాలీవుడ్ చిత్రాల్లో నటించడం వల్లే సన్నీ స్టార్ అయిందని, అడల్ట్ సిన్మాల్లో నటించడం ద్వారా కాదని చెప్పానని తెలిపింది. కొందరు నిర్మాతలు కూడా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ప్రస్తుతం తనకు ఎవరి సహాయ, సహకారాలు అవసరం లేదన్న షెర్లిన్ తనకే ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ఉందని వెల్లడించింది. ఎలాంటి పబ్లిసిటీ కోసం తాను ఇలాంటి  ఈ విషయాలను వెల్లడించడం లేదని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.

Sherlyn Chopra accuses Varma offering adult film