Thursday, April 25, 2024

శిల్పాచౌదరికి మరోసారి పోలీస్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

Shilpa Chowdhury once again in police custody

హైదరాబాద్: పెట్టుబడులు, అధిక వడ్డీల కేసు దర్యాప్తులో పురోగతి కోసం శిల్పాచౌదరిని మరోసారి కస్టడీకి అనుమతించాలని నార్సింగి పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన కోర్టు ఆమెను మూడు రోజుల పాటు కస్టడీకిస్తూ గురువారం నాడు అనుమతిచ్చింది. శిల్పపై ఉన్న కేసులు, డబ్బులు వసూలు చేసిన వైనం గురించి తెలుసుకోవాల్సి ఉందని నార్సింగి పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు శిల్పాచౌదరిని కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శిల్పను నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని సైతం విచారించనున్నారు.

కాగా శిల్పపై మూడు కేసులు నమోదు కావడంతో రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసి తిరిగి చెల్లించలేదనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ కీలక విషయాలపై ఆమె పెదవి విప్పలేదన్నది సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖుల నుచి తీసుకున్న డబ్బులు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు శిల్ప పోలీసులకు తెలిపింది. స్పష్టమైన వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు మరోసారి ఆమెను ప్రశ్నించనున్నారు. శిల్ప బ్యాంకు లావాదేవీలతో పాటు ఆమె ఇంట్లో సేకరించిన పత్రాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులిచ్చారు. వాళ్ల నుంచి కూడా నార్సింగి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News