Home జాతీయ వార్తలు రేపు గవర్నర్‌ను కలవనున్న శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్

రేపు గవర్నర్‌ను కలవనున్న శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్

Shiv Senaముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్ నాయకులు శనివారం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలవనున్నట్లు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని శుక్రవారం ఆయన తెలిపారు. శివసేనకే ముఖ్యమంత్రి పదవి దక్కాలన్న ఆ పార్టీ నాయకుల వాదనను ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, తమ కూటమి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఎన్‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్ మాట్లాడుతూ బిజెపి, శివసేన మధ్య సిఎం పదవి కోసమే విభేదాలు ఏర్పాడ్డాయని, అందుకే సిఎం పదవి కోసం తమ పార్టీ పోటీపడబోదని చెప్పారు. శివసేన నుంచే సిఎం అభ్యర్థి ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కాగా, శివసేన నుంచి సిఎం పదవికి ఎవరు ఉంటారో ఇంకా తెలియరాలేదు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సిఎంగా ఎంపికవుతారా లేక మరెవరినైనా ఎంపికచేస్తారా అన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం జరగలేదు.

Shiv Sena alliances will meet guv tomorrow

Shiv Sena, NCP and Congress have came to understand to form the government in Maharastra