Friday, March 29, 2024

కంగన వ్యాఖ్యలపై మహావికాస్ నేతల మండిపాటు

- Advertisement -
- Advertisement -
Shiv Sena demands withdrawal of Kangana Awards 
అవార్డులు వెనక్కి తీసుకోవాలని శివసేన డిమాండ్

ముంబయి: దేశ స్వాతంత్య్రంపై బాలీవుడ్‌నటి కంగనారనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవిఎ) కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి ఘాటుగా స్పందించాయి. కంగన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టత ఇవ్వాలని శివసేన డిమాండ్ చేసింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులన్నీ వెనక్కి తీసుకోవాలని శివసేన నేత సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. అలా చేయనిపక్షంలో అమృత్ మహోత్సవ్ పేరుతో 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే హక్కు కేంద్రానికి లేదని రౌత్ అన్నారు. కంగన వ్యాఖ్యల పట్ల తమ మనసులో ఏముందో(మన్‌కీబాత్) మోడీ, నడ్డా స్పష్టం చేయాలని సంజయ్‌రౌత్ అన్నారు. కంగనారనౌత్‌ను బిజెపికి తోలుబొమ్మ అంటూ కాంగ్రెస్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించింది. బుధవారం ఓ న్యూస్ ఛానల్‌లో కంగన మాట్లాడుతూ 1947లో దేశానికి వచ్చింది స్వాతంత్య్రం కాదు భిక్ష అన్నారు. 2014లోనే(మోడీ అధికారంలోకి రావడంతోనే) నిజమైన స్వాతంత్య్రం వచ్చిదని కంగన అన్నారు. 24 సెకండ్లపాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో, పలువురు కంగనపై మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News