Home జాతీయ వార్తలు పాక్ ఐసియులో ఉంది: శివసేన

పాక్ ఐసియులో ఉంది: శివసేన

ముంబయి: పాక్ వ్యవహార శైలిపై శివసేన మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులతో ప్రస్తుతం ఆ దేశం ఐసియులో ఉందని ఎద్దేవా చేసింది. కశ్మీర్ వ్యవహారంలో పాక్ అనవసర జోక్యాన్ని తన అధికార పత్రిక ‘సామ్నా’లో శివసేన ఎండగట్టింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపై బాధపడే కన్నా ఆ దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించింది. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా కౌన్సిల్‌లో భారత్ ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించి చైనా, పాకిస్థాన్ విఫలమయ్యాయని పేర్కొంది.

Shiv Sena fires on Pakistan