Home జాతీయ వార్తలు కర్నాటకలో కాంగ్రెస్ కు పెద్ద షాక్

కర్నాటకలో కాంగ్రెస్ కు పెద్ద షాక్

Congressబెంగళూరు: అంతర్గత కుమ్ములాటలతో సతమవుతున్న కర్నాటక కాంగ్రెస్ కు మరో పెద్ద షాక్ తగిలింది.  బెంగళూరులోని శివాజీ నగరకు చెందిన ఐఎంఎ జువెల్స్‌ అనే సంస్థ  బోర్డు తిప్పేసింది. దీంతో 10 వేల మంది ఖాతాదారులు నిలువునా మోసపోయారు. రూ.500 కోట్లకు పైగా ఖాతాదారుల సొమ్మును కాజేసి ఐఎంఎ యజమాని మహ్మద్‌ మన్సూర్‌  పరారయ్యారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రోషన్ బెయిగ్‌ పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ఆధారంగా ఆడియో రికార్డర్‌ ఒకటి వైరల్‌ మారింది. ఐఎంఎ జువెల్స్‌లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో నగలు లేదా నగదు రూపంలో తిరిగి చెల్లిస్తామని ఆ సంస్థ యజమాని ఖాతాదారులను నమ్మించాడు. ఈ క్రమంలో వేలాది మంది ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో  ఐఎంఎ జువెల్స్‌ ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. రూ.400కోట్లు లంచం తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులతో మన్సూర్‌ ఖాన్‌ మాట్లాడుతున్న ఆడియోలో కాంగ్రెస్‌ నేత రోషన్‌ బెయిగ్‌ ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మన్సూర్‌ ఖాన్‌కు అనకూలంగా  రోషన్‌ మాట్లాడినట్లు ఆ ఆడియోలో రికార్డు అయింది. రోషన్ ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నగల కుంభకోణంలో రోషన్ పేరు వినబడడంతో కర్నాటక కాంగ్రెస్ లో విభేదాలు భగ్గమంటుున్నాయి. ఈ కేసులో నిందితులను వదిలి పెట్టమని, సిబిఐ విచారణకు ఆదేశిస్తామని కర్నాటక సిఎం కుమారస్వామి తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వంపై బిజెపి విమర్శలు చేస్తోంది. సిఎం కుమారస్వామితో మన్సూర్ ఖాన్ కలిసి ఉన్న ఫోటోనే బిజెపి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నగల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ సిఎం కుమారస్వామికి చాలా సన్నిహితుడని బిజెపి ఆరోపిస్తుంది. ఈ వ్యవహారంపై సిఎం కుమారస్వామి స్పందించారు. పాత ఫొటోనే ఉపయోగించి ప్రభుత్వంపై ప్రజలకు అపనమ్మకం కలిగేలా బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నగల కుంభకోణంలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Shock To Congress in Karnataka