Home జాతీయ వార్తలు పెళ్లిలో కాల్పులు …

పెళ్లిలో కాల్పులు …

GUNFIRE

చండీఘఢ్ : పెళ్లి వేడుకల్లో ఓ మహిళ కాల్పులు జరిపింది. వేడుకల్లో కాల్పులు జరపవద్దని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ ఈ ఆనవాయితీ పోవడం లేదు. హరియాణలోని కర్నల్ పట్టణంలో మంగళవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సాధ్వి దేవాఠాకూర్ అనే ఆధ్యాత్మిక మాత అతిథిగా వచ్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లకుండా తన 12 మంది భద్రతా సిబ్బందితో కలిసి గాల్లోకి కాల్పులు జరిపింది. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో పెళ్లి కొడుకు బంధువులు గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ చనిపోయింది. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితులపై హత్య, ఆయుధాలు కలిగి ఉన్న కేసులు నమోదు చేశారు.