Home జాతీయ వార్తలు బస్సులో వ్యక్తి కాల్చివేత

బస్సులో వ్యక్తి కాల్చివేత

GUNచెన్నయ్ : బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటన తమిళనాడులో సత్తూర్‌లో జరిగింది. చెన్నయ్‌కి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో బస్సులో వెళుతున్న ఓ ప్రయాణికుడిపై ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.