Home స్కోర్ ఏం కొట్టినా ఈరోజే!

ఏం కొట్టినా ఈరోజే!

కోహ్లీ, రహానేలపైనే బ్యాటింగ్ భారం

విజయం కష్టమే…డ్రా దిశగా తొలి టెసు

పుజారా, విజయ్ శతకాలు

భారత్ 319/4

cricరాజ్‌కోట్ : భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ రస పట్టులో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమ యానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసిం ది. మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారాలు అద్భుతమైన సెంచరీలు సాధించి మ్యాచ్‌ను పోటీస్థాయికి తీసుకువ చ్చారు. నాల్గవ రోజైన శనివారం ఇరుజట్లకూ చాలా కీలకం. త్వరగా వికెట్లు సాధించగలిగితే ఇంగ్లాండ్ విన్నింగ్ దశకు చేరుకుంటుంది. లేదా భారత్ బ్యాట్స్ మన్లు రోజంతా క్రీజ్‌లో నిలబడి, పోటీస్కోరు సాధించ గలిగితే ఓటమి నుంచి తప్పించుకోవచ్చు. భారత్ బ్యాట్స్ మెన్ నిలబడితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు సాధించిన తర్వాత రెండో రోజు భారత్ బ్యాటింగ్ మొదలు పెట్టి వికెట్టు నష్టపోకుండా 63 పరుగులు చేసిన విషయం తెల్సిందే. అదే ఓవర్‌నైట్ స్కోరు తో శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు ఆరం భంలోనే షాక్ తగిలింది. లంచ్ విరామానికి ముందే భారత్ ఓపెనింగ్ వికెట్టును చేజార్చుకుంది. చాన్నాళ్ళ తర్వాత మరోసారి బ్యాట్ పట్టే అవకాశం చేజిక్కించుకు న్న గౌతమ్ గంభీర్ (29) అనుకోకుండా బ్రాడ్ సంధించిన లైన్ అండ్ లెన్త్ బంతికి చిక్కి, ఎల్బీడబ్లుగా నిష్క్రమించాడు. కీలకమైన వికెట్టు చేజారినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని భారత్ అద్భుతంగా ఆడి పుంజు కున్నది. మురళీ విజయ్‌కు ఛటేశ్వర్ పుజారా తోడుగా నిలిచాడు. ఇద్దరూ మంచి సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. దాదాపు ఐదు గంటలపాటు క్రీజ్‌లో నిలిచిన మురళీ, పుజారా లు ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రాజ్‌కోట్‌లో పుట్టిన పుజారా తన సహచర బ్యాట్స్‌మన్ మురళీ కన్నా కాస్త స్పీడ్‌గానే బ్యాటింగ్ చేశాడు. పైగా పుజారాకు స్థానిక అభిమానుల మద్దతు లభించడంతో బ్యాట్‌తో చెలరేగాడు. 39వ టెస్టు ఆడుతున్న పుజారా 17 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. ఇది 9వ టెస్టు సెంచరీ కావడం విశేషం. బెన్ స్టోక్స్ ప్రయోగించిన ఒక వైడ్‌బాల్‌ను పుజారా టిప్ చేయడంతో అది కుక్ చేతిలోకి వెళ్లింది. అతను మురళీతో కలిసి రెండో వికెట్టుకు 209 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఓపెనర్ మురళీ విజయ్ కూడా అప్పటికే అద్భుతంగా రాణించాడు. టీ విరామం తర్వాత మురళీకి కోహ్లీ జతకలిశాడు. వీరిద్దరూ మూడో వికెట్టుకు 41 పరుగుల భాగస్వామ్యం అందించారు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అద్భుతమైన షాట్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. పుజారాతో కలిసి మూడంకెల స్కోరు భాగస్వామ్యం అందించడం ఇది తొలిసారి కాదు. వీరిద్దరూ ఇప్పటివకు మూడుసార్లు భారీ భాగస్వామ్యాలు అందించారు. మూడేళ్ళ క్రితం హైదరాబాద్ టెస్టులో ఆస్ట్రేలియాపై ఏకంగా 370 పరుగుల అత్యుత్తమ భాగస్వామ్యం అందించారు. మురళీ విజయ్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ. న్యూజిలాండ్‌పై ఇది రెండోది. గత ఏడాది మార్చిలో ఫతుల్లాలో బంగ్లాదేశ్‌పై 150 పరుగుల స్కోరు చేసిన తర్వాత సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి. ఆట ముగియడానికి కేవలం ఐదు నిమిషాల ముందు మురళీ విజయ్ అవుటయ్యాడు. ఈ తరుణంలో అమిత్ మిశ్రా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. కానీ అతను జాఫర్ అన్సారీ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్‌లో మూడో బంతికి అనూహ్యమైన రీతిలో హసీబ్‌కు క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఏదేమైనప్పటికీ, టీ విరామం తర్వాత మూడు వికెట్లు తీసుకున్న ఇంగ్లాండ్ ఒక విధంగా మంచి స్కోరింగ్ సాధించినట్లే. అందులోనూ ఆఖరి ఆరు నిమిషాల్లో ఇంగ్లాండ్ రెండు వికెట్లు పడగొట్టింది.
డ్రా దిశగా…
నాల్గవ రోజు శనివారంనాడు కోహ్లీతోపాటు అజింక్య రహానే, వృద్ధమాన్ సాహా, రవీంద్ర జడేజాల బ్యాటింగ్‌పై భారత భవితవ్యం ఆధారపడి వుంటుంది. అన్నింటికీ మించి కెప్టెన్ కోహ్లీ, రహానేలు ఏ మేరకు ఆడగలుగుతారో దానిపైనే ఇండియా స్కోరు, మ్యాచ్ ఫలితం ఆధారపడి వుంటుంది. ఇండియా జట్టు టీ విరామానికి ముందే అవుటైనా ఇంగ్లాండ్ మిగిలిన రోజంతా ఆడి భారత్ ముందు కనీసం 250 పరుగుల స్కోరు విజయలక్షాన్ని ఇవ్వగలిగితే అప్పుడు మ్యాచ్ కచ్చితంగా రసకందాయంలో పడుతుంది. అయితే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

స్కోరు బోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 537-ఆలౌట్
భారత్ మొదటి ఇన్నింగ్స్
మురళీ విజయ్ (సి) హసీబ్ హమీద్ (బి) ఆదిల్ రషీద్ 126 (301, 9×4, 4×6), గౌతమ్ గంభీర్ (ఎల్‌బిడబ్లు) (బి) బ్రాడ్ 29 (72 (4×4), ఛటేశ్వర్ పుజారా (సి) కుక్ (బి) స్టోక్స్ 124 (206, 17×4), విరాట్ కోహ్లీ (బ్యాటింగ్) 26 (70, 3×4), అమిత్ మిశ్రా (సి) హసీబ్ హమీద్ (బి) జాఫర్ అన్సారీ 0 (2), ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : 319 (4 వికెట్లు, 108.3 ఓవర్లు).
వికెట్ల పతనం : 68-1, 277-2, 318-3, 319-4
బౌలింగ్ : స్టువార్ట్ బ్రాడ్ 20-7-54-1, క్రిస్ వోక్స్ 23-5-39-0, మొయిన్ ఆలీ 22-6-70-0, జాఫర్ అన్సారీ 17.3-1-57-1, ఆదిల్ రషీద్ 16-1-47-1, బెన్ స్టోక్స్ 10-1-39-1.