Friday, April 19, 2024

బషీరాబాద్ సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్

- Advertisement -
- Advertisement -

show-cause notices to Basheerabad Sarpanch

రూ.కోటి 13 లక్షల నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూడూరు ప్రియాంకకు, ఉప సర్పంచ్‌కు గత గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ పంచాయతీ విభాగం వివరాల ప్రకారం…బషీరాబాద్ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గ్రామ సర్పంచ్ ప్రియాంక భర్త శ్రావన్ కుమార్ ఇస్టానుసారంగా గ్రామ పంచాయతీ నుండి డబ్బులు డ్రా చేసుకున్నారని గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులతో, మండల అధికారులతో క్షేత్ర స్థాయిలో విచారణ జరుపగా వ్యయానికి సంబంధించి ఎంబి రికార్డులు, వోచర్స్, కాష్ బుక్ సమర్పించలేకపోవడంతో గ్రామ పంచాయతీ సొమ్ము తాత్కాలికంగా దుర్వినియోగమైనట్లు భావించడం జరిగిందని దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏడు రోజులలో సమర్పించాలని లేని యడల శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

సర్పంచ్ ప్రియాంక ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో మాత్రం అభివృద్ధి జరగలేదు. గ్రామ సర్పంచ్ ప్రియాంక భర్త శ్రావన్ మాత్రం ఇస్టానుసారంగా ఎంబి రికార్డులు చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కమిషన్ ఇచ్చి ప్రభుత్వ సొమ్మును కాజేశారని వార్డు సభ్యులు వాపోయారు. అయితే బషీరాబాద్ గ్రామ పంచాయతీలో ఇంత సొమ్ము దుర్వినియోగం జరిగిందని జిల్లా అధికారులు భావిస్తుంటే స్థానిక మండల పంచాయతీ అధికారి రమేష్ ఏం చేస్తున్నారని ఎంపిఓ కూడా అమ్ముడుపోయారా? పర్యవేక్షణ ఎందుకు కరువైంది. బషీరాబాద్‌లోని ఎంపిడిఓ కార్యాలయానికి గ్రామ పంచాయతీకి ఎంత దూ రం ఉంటుందని మండల అధికారులు కూడా ఇలా అమ్ముడు పోతే ఏలా అంటూ వార్డు సభ్యులు తెలిపారు. గ్రామ సర్పంచ్ ప్రియాంక భర్త శ్రావన్‌కుమార్ కోటి 13 లక్షల రూపాయల దుర్వినియోగం చేశారని, మిని ట్యాంకుల పేరుతో మూడు సా ర్లు డబ్బులు డ్రా చేసి అవినీతికి పాల్పడ్డారని, ఉన్నతాధికారులు విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు కోరుతున్నారు. అవినీతికి పాల్పడ్డారని షోకాజ్ నోటిస్ వచ్చింది నిజమే కాని శాఖ పరమైన చర్యలు ఉన్నత అధికారులు తీసుకుంటారా లేదా బడా రాజకీయ నాయకుల సహాయంతో తప్పుదోవపట్టిస్తారా వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News