Tuesday, February 7, 2023

‘షో టైమ్’ పాటలొచ్చేశాయ్

- Advertisement -

Showtimeరమా రీల్స్ బ్యానర్‌పై రణధీర్, రుక్సర్ మీర్ హీరోహీరోయిన్‌లుగా ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం ‘షో టైమ్’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో హీరోయిన్ అనుష్క ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని శివశక్తి దత్తాకు అందజేశారు. దర్శకుడు రాజమౌళి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ చాలా బావుంది. సినిమా థియేటర్‌లో జరిగే కథ ఇది. కీరవాణి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. అనుష్క మాట్లాడుతూ “రాజమౌళి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నన్ను ఏదో ఒక కొత్త విషయంతో ఆశ్చర్యపరుస్తుంటారు. అందరూ మంచి టాలెంటెడ్. సినిమా పాటలు బావున్నాయి”అని చెప్పారు. కాంచీ మాట్లాడుతూ “మంచి సినిమా తీయగలనన్న నమ్మకంతో చేసిన సినిమా ఇది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ బాగా చేశారు. సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది”అని అన్నారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ “ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా అన్న ఆసక్తి కలుగుతోంది. కాంచీ, టీంకు అభినందనలు”అని చెప్పారు. సుధీర్ పూదోట మాట్లాడుతూ “కాంచీ సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేస్తాం. ఇక కాంచీ దర్శకత్వంలోనే మరో సినిమా చేయాలనుంది”అని అన్నారు. ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ “ఈ సినిమాలో ఎమోషన్సే పాత్రధారులు. స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ఏమీ లేవు. మంచి మ్యూజిక్ కుదిరింది. అందరికీ పాటలు కనెక్ట్ అవుతాయి”అని తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “కాంచీలో వెటకారం ఎక్కువగా కనపడుతుంటుంది. తన సినిమాలో ఏ తప్పులు ఉండకుండా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో పివిపి, రణధీర్, రుక్సర్ మీర్, సుప్రీత్ సహా సినిమా టీం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles