Saturday, December 2, 2023

30 ఏళ్ల ముందుండే కథతో.!

- Advertisement -
- Advertisement -

Shraddha Srinath says about her movie

 

జెర్సీ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి శ్రద్దా శ్రీనాథ్. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు బాగానే పెరిగాయి. శ్రద్దా శ్రీనాథ్ చేయనున్న సినిమాల్లో ఒక బైలింగ్వల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూపొందనుంది. ప్రమోద్ సుందర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్ర చేయనుంది. ఈ సినిమా కథ రెగ్యులర్ సినిమాల్లా కాకుండా కొంచెం భిన్నంగా ఉంటుందట. ఈ సినిమా కథ 2050 టైమ్ పిరియడ్‌లో సెట్ చేశాడట డైరెక్టర్. అంటే ఇప్పుడున్న టైమ్ పిరియడ్ కంటే 30 ఏళ్ల ముందు ఉంటుందట కథ. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. సినిమా కథ చెన్నైలో జరుగుతుందట. ‘కలియుగం’ అనేది సినిమా టైటిల్. ఈ చిత్రం తన కెరీర్‌లోనే భిన్నమైన సినిమా అని, ఇలాంటి కథను ఇంతకుముందెప్పుడూ చూసి ఉండరని చెప్పింది శ్రద్దా శ్రీనాథ్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News