Home తాజా వార్తలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జైనక్షేత్రం ఆంగలయ్య గుట్టకు పూర్వవైభవం

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జైనక్షేత్రం ఆంగలయ్య గుట్టకు పూర్వవైభవం

Shravanabelagola jain mutt pontiff visits aggalaiah gutta

 

వరంగల్ : హన్మకొండలోని పద్మాక్షిగుట్ట సమీపంలో ఉన్న జైన క్షేత్రం ఆంగలయ్య గుట్టను ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రావణ బెలగొల గోమటేశ్వర జైన పీఠాధిపతి, చారుకీర్తి భట్టారక స్వామిజీ(శ్రావణబెలగొల పీఠాధిపతి) శనివారం వరంగల్‌ను సందర్శించడం గొప్ప విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. దేశంలోనే ఎత్తయిన బాహుబలి విగ్రహం శ్రావణబెలగొల ప్రాంతానికి దాదాపు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉందని, వరంగల్ కూడా పూర్వం ఒక గొప్ప జైన కేంద్రమన్నారు. వరంగల్ అనగానే మనకు కాకతీయులు గుర్తుకువస్తారు. కాని వరంగల్ నగరానికి అంతకాన్న గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని వివరించారు. ఇన్ని రోజులు గుట్టపైకి వెళ్లేందుకు సరైనమార్గం లేకపోవడంతో మరుగున పడిందని, గతేడాది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం హృదయ్ పథకంలో చేర్చడంతో అభివృద్ధి జరిగిందన్నారు.

తాను ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులకు గాను రూ.1.3 కోట్లు కేటాయించామని, గుట్టపైకి వెళ్లేందుకు సుమారు 300 రాతిమెట్లను కొండకే తొలిచారు. కేవలం ఆరునెలల వ్యవధిలో మెట్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఆంగలయ్య గుట్ట అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట లాంటి పర్యాటక ప్రదేశాల సరసన ఆంగలయ్య గుట్ట కూడా చేరిందని చారుకీర్తి భట్టారక స్వామిజీఅన్నారు. జైన క్షేత్ర పరిసరాలు అభివృద్ధి అయ్యేలా చొరవ చూపి సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన ఎంఎల్‌ఎ దాస్యం వినయభాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, భీంరావు, ఆర్‌డిఒ వాసుచంద్ర, తహసీల్దార్ రాజ్‌కుమార్, జైనప్రతినిధులు అనిల్‌జైన్, ప్రకాష్‌జైన్,కిషోర్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.

Shravanabelagola jain mutt pontiff visits aggalaiah gutta