Friday, June 13, 2025

విజయోత్సాహంలో ఉన్న శ్రేయస్‌కు.. బిసిసిఐ షాక్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌ 18వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఆదివారం ముంబై ఇండియన్స్ జట్టుపై భారీ విజయం సాధించిన పంజాబ్‌ కింగ్స్ ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రెండు జట్లు ఇప్పటివరకూ ఒకసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకోలేదు. దీంతో ఈసారి ఫైనల్స్‌ పోరు ఆసక్తికరంగా మారింది. అయితే క్వాలిఫయర్‌-2లో ముంబై‌పై ఘన విజయం సాధించిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) బిసిసిఐ షాక్ ఇచ్చింది. మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటేన్ చేసినందుకు అతనికి జరిమానా (Fine) విధించింది.

పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేయడం ఇది రెండోసారి దీంతో కెప్టెన్ శ్రేయస్‌కి (Shreyas Iyer) ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం రూ.24 లక్షల జరిమానా (Fine) విధించింది. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారులు వెల్లడించారు. శ్రేయస్‌తో పాటు జట్టు సభ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యార్  41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో చెలరేగి ఆడటంతో పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News