Friday, July 18, 2025

అమ్మ వర్సెస్ అయ్యర్.. ఇది అసలైన వరల్డ్‌కప్ ఫైనల్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్‌ని ఫైనల్స్‌ వరకూ తీసుకుపోయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తృటిలో ట్రోఫీని చేజార్చుకున్నాడు. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కి అయ్యర్ ఎంపిక కాలేదు. దీంతో దొరికిన ఖాళీ సమయాన్ని తన కుటుంబంతో గడపుతున్నాడు. తాజాగా తన ఇంట్లో తన తల్లి రోహిణితో (Shreyas Iyer Mother) కలిసి క్రికెట్ ఆడాడు అయ్యర్. తల్లి బౌలింగ్ చేయగా.. తను బ్యాటింగ్ చేశాడు.

అయితే తన తల్లి (Shreyas Iyer Mother) బౌలింగ్‌లో శ్రేయస్ బంతిని కొట్టలేకపోయాడు. దీంతో అతన్ని ఔట్ చేసినట్లుగా ఆమె సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఓ అభిమాని ‘అమ్మ వర్సెస్ అయ్యర్.. లివింగ్ రూంలో అసలైన ప్రపంచకప్ ఫైనల్’ అనే క్యాప్షన్‌ పెట్టగా.. పంజాబ్ కింగ్స్ జట్టు దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ‘సర్పంచ్ ఈ ఒక్కసారి మాత్రం బౌల్డ్ అయినా పట్టించుకోడు’ అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఆంటీ అద్భుతంగా బౌలింగ్ చేశారు’.. ‘అమ్మ బౌలింగ్ చేస్తే.. ఎవరైనా ఔట్ కావాల్సిందే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News