Friday, June 13, 2025

రోహిత్‌కి షాకివ్వనున్న అయ్యర్.. కెప్టెన్ పోస్ట్‌కి ఎసరు..

- Advertisement -
- Advertisement -

టీ-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కి.. రీసెంట్‌గా టెస్ట్ క్రికెట్‌కి రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కి ముందు రోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు ఎదురైంది. అయితే ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. ఇప్పటికే టి-20ల్లో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు రోహిత్ వన్డే కెప్టెన్సీ పోస్ట్‌కు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఐపిఎల్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పంజాబ్ కింగ్స్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. సుమార్ 10 సంవత్సరాల తర్వాత పంజాబ్‌ను ఫైనల్స్‌కి తీసుకువెళ్లాడు. ఫైనల్స్‌లో ఓటమిపాలైనప్పటికీ.. శ్రేయస్‌ కెప్టెన్సీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే.. గతకొంతకాలంగా శ్రేయస్ వన్డే క్రికెట్‌కే పరిమియతమయ్యాడు. ఈ క్రమంలో వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను అతనికి అప్పగిస్తారని ఓ ఆంగ్ల పత్రిక కథనం ద్వారా తెలుస్తోంది. మూడు ఫార్మాట్‌లలో వేర్వేరు కెప్టెన్లను నియమించాలని బిసిసిఐ యోచిస్తున్నట్లు ఓ బిసిసిఐ అధికారి ఆ ఆంగ్ల పత్రికతో పేర్కొన్నారు. దీంతో వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్‌మెంట్ ప్రకటించినా.. లేకపోయినా.. కెప్టెన్సీ నుంచి తప్పుకోనే అవకాశం ఉంది. దీంతో శ్రేయస్‌కు వన్డే కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News