Friday, April 19, 2024

యాదాద్రిలో వైభవంగా శ్రీవారి స్వాతి నక్షత్రపూజలు

- Advertisement -
- Advertisement -
  • శ్రీలక్ష్మీనరసింహుడికి శతఘటాభిషేకం, గిరిప్రదక్షిణ చేసి తరించిన భక్తులు
  • ఆలయ నిత్యపూజలో భక్తులు
  • నిత్యరాబడి రూ.28.41 లక్షలు

యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ్ది కేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీవారి జన్మనక్ష్రతం స్వాతి నక్షత్ర పూజలు, అష్టోత్తర శతఘటాభిషేకాన్ని శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. గురువారం స్వాతినక్షత్రం సందర్భంగా స్వామివారి భక్తుల గిరి ప్రదక్షిణలతో ఆలయ పరిసరాలు, కొండకింద లక్ష్మీనారసింహుడి నామస్మరణ మారుమోగింది. పాతగుట్ట ఆలయంలోనూ స్వాతి నక్షత్ర పూజలతో శ్రీలక్ష్మీనరసింహుడికి ఉత్సవ మహోత్సవాల శోభ నెలకొంది. జన్మనక్షత్రం స్వాతి పురస్కరించుకొని యాదాద్రి ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఆలయంలో ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు శ్రీ స్వామి వారికి శతఘటాభిషేకం పూజలను 108 కలుశాలతో నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహుని మంత్ర జలములతో అర్చకులు అభిషేకించి పూజలు చేయగా భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు, స్థానికులు తెల్లవారుజాము నుండే యాదాద్రి కొండ చూట్టు శ్రీనరసింహ స్వామి నామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ చేశారు. తెల్లవారుజామున ఆలయం తెరచి సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు ఆలయంలో జరుగు నిత్యపూజలు అభిషేకం, అర్చన, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడిసేవ తదితర పూజలో భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

శ్రీవారి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా గురువారం రోజున రూ.28,41,909 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,77,900, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,20,500, వీఐపీ దర్శనం ద్వారా రూ.1,20,000, కొండపైకి వాహనాల ద్వారా రూ.3,50,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.11,80,900, తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం శాసనమండలి విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్‌రావు దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News