Home తాజా వార్తలు చిరు సినిమాలో శ్రియా?

చిరు సినిమాలో శ్రియా?

chiru-with-shriya1వయసు మీరుతున్నా… ఆ వయసును అస్సలు కనపడనివ్వని అందం శ్రియా శరణ్ సొంతం. ఈ బ్యూటీ తాజాగా నందమూరి బాలకృష్ణకు జోడీగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో నటిస్తోంది. మహారాణి వశిష్టీ దేవిగా శ్రియా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా రాబోతోంది. ఇదే పండుగకు రానున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ రోల్ చేయాలని శ్రియాకు ఓ ఆఫర్ వచ్చిందని తెలిసింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. గతంలో చిరంజీవితో కలిసి ‘ఠాగూర్’ చిత్రంలో శ్రియా నటించింది. అప్పట్లో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ కూడా వివి వినాయక్ దర్శకత్వంలోనే రూపొందింది. ఇప్పుడు మరోసారి చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడంతో వెంటనే ఈ ఆఫర్‌ను శ్రియా ఒప్పేసుకుందని సమాచారం.