Friday, March 29, 2024

ఆ రోజులే వేరు… ఆ కిక్ మళ్లీ రాదు!

- Advertisement -
- Advertisement -

Shriya remembered memories

 

ప్రతి హీరోయిన్‌కు కొన్ని ప్రైవేట్ మూమెంట్స్ ఉంటాయి. హీరోలు, డైరక్టర్స్ లేదా తోటి హీరోయిన్లతో ప్రైవేట్ పార్టీలు చేసుకోవడం వారికి కామన్. అయితే వాటికి సంబంధించిన ఫొటోలు మాత్రం కేవలం వాళ్ల మొబైల్స్ కే పరిమితం. బయటకు పెద్దగా రావు. ఒకవేళ వస్తే మాత్రం అవి సంచలనాలే. కానీ శ్రియా మాత్రం ఏరికోరి అలాంటి ప్రైవేట్ ఫొటో ఒకటి బయటపెట్టింది. నిర్మాత తనూజ్ గర్గ్ తో ఓ రాత్రి ఫుల్‌గా పార్టీ చేసుకొని పీకల వరకు తాగిన టైమ్‌లో దిగిన ఓ ఫొటోను శ్రియా షేర్ చేసింది. అక్కడితో ఆగలేదు ఈ బ్యూటీ. ‘ఆ రోజులే వేరు, ఆ కిక్ మళ్లీ రాదు’ అని కామెంట్ కూడా చేసింది. నిజంగా ఇలాంటి ప్రైవేట్ ఫొటోలను షేర్ చేసేందుకు తారలు ఇష్టపడరు. కానీ శ్రియా మాత్రం ఏమాత్రం మొహమాటపడకుండా ఆ ఫొటోను బయటపెట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News