Friday, April 19, 2024

భారీ మల్టీస్టారర్‌లో నటిస్తున్నా

- Advertisement -
- Advertisement -

Shriya Saran in RRR movie

 

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది భామ శ్రియా శరణ్. దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీని ఏలిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈ అందాల తార రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో శ్రియా నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని ఆమె పేర్కొంది. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్‌కి జోడీగా కనిపించబోతున్నానని చెప్పింది. అంతేకాకుండా ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియాల ఎపిసోడ్ ప్లాష్ బ్యాక్‌లో వస్తుందని తెలిసింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ కూడా కనిపించబోతోందన్న మాట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News