Thursday, April 25, 2024

నెగటివ్ రోల్‌లో శృతి

- Advertisement -
- Advertisement -

Shruti hasan act in negative role

 

హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ షో చేయడానికే పరిమితం అనే రోజులు పోయాయి. ఇప్పటి తరం హీరోయిన్స్ ఎలాంటి రోల్స్ చేయడానికైనా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్స్ సైతం నెగటివ్ రోల్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లేడీ విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. బాలీవుడ్‌లో సత్తా చాటాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న శృతి హాసన్ ఇటీవల పలు హిందీ సినిమాలు చేసింది. ఈ క్రమంలో ఆమె నటించిన ’యారా’ మూవీ ఈనెల 30న జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ కానుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పిందట. కాకపోతే ఈ సినిమాలో అమ్మడు నెగటివ్ రోల్‌లో నటించనుందట. డెబ్యూ మూవీ ’లక్’ నుంచి బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనిపించుకోవాలని చూస్తున్న శృతి హాసన్ ఇప్పటికైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఇక తెలుగులో ఈ భామ చాలా గ్యాప్ తీసుకొని రవితేజ సరసన ’క్రాక్’, పవన్ కళ్యాణ్ తో ’వకీల్ సాబ్’ సినిమాల్లో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News