Home తాజా వార్తలు శృతిహాసన్ తిరిగి సినిమాల్లోకి

శృతిహాసన్ తిరిగి సినిమాల్లోకి

 

కమల్‌హాసన్ వారసురాలిగా 2009లో చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆయన పెద్ద కుమార్తె శృతిహాసన్. కెరీర్ ప్రారంభంలో మూడేళ్ల పాటు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఆమెకు ఒక్క హిట్ కూడా లేదు. కానీ పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా శృతిహాసన్ స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి పెద్ద హిట్స్, తమిళంలో ‘వేదాళం’ లాంటి హిట్ చిత్రాలతో ఆమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అయితే 2017లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది.

శృతి చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయితే ఆమె సినిమాలకు దూరం కావడానికి తన బాయ్‌ఫ్రెండ్ మేఖేల్ కోర్సలే కూడా ఒక కారణమనే టాక్ ఉంది.ఇక ఇంటర్నేషనల్ సింగర్‌గా, రాక్‌స్టార్‌గా పేరు తెచ్చుకుందామని… ఒరిజినల్ మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో శృతిహాసన్ ఎక్కువగా లండన్‌లోనే ఉంటూ వచ్చింది. గత ఏడాది అంతా ఈ ప్రయత్నాల్లోనే బిజీగా గడిపింది శృతి. కానీ ఆమె ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం శృతిహాసన్ తన మనసు మార్చుకొని మళ్లీ సినిమాల్లోకి వస్తోందని తెలిసింది. ఇప్పటికే ఆమె రెండు తమిళ సినిమాలకు కూడా ఓకే చెప్పిందట. ఆ రెండింటిలో ఒక సినిమా హీరో విజయ్ సేతుపతిది అని అంటున్నారు.

Shruti Hassan once again busy with movies