Home ఎడిటోరియల్ నెట్ బంద్ అయితే?!

నెట్ బంద్ అయితే?!

Inter-net

గత ఏడాది ‘ఇంటర్నెట్ షట్‌డౌన్’ ( తాత్కాలికంగా కొంతకాలం పాటు నెట్ మూసివేయడం)వల్ల భారత్‌కు రూ. 6,485 కోట్ల నష్టం వచ్చింది. ఇది యుద్ధంలో చిన్నాభిన్నమైన ఇరాక్‌కు వచ్చిన ‘నెట్ బంద్ నష్టం’తో సమానం. అమెరికాలోని మేధావుల బృందం బ్రూకిం గ్స్ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థపై ఈ షట్‌డౌన్లు విరుద్ధ ప్రభావం చూపుతాయని ఈ సర్వేలో స్పష్ట మైంది. కశ్మీర్‌లో ప్రస్తుత అశాంతి నిరోధానికి ఇంటర్నెట్ సర్వీసు లను మూసివేశారు. మూడు నెలలకు మించి ఆ రాష్ట్రంలో అశాంతి నెలకొనడంతో మొబైల్ నెట్ సర్వీసులను కూడా మూసేశారు. దీనివల్ల ఆ రాష్ట్ర సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం నిర్వాపారం గా పడి ఉండి ఉద్యోగాల కోతకు దారితీయడంతోపాటు ఐటి కార్యకలాపాలను రాష్ట్రం వెలుపలకు మార్చారు.
2015 జూలై 1 నుంచి ప్రస్తుత సంవత్సరం జూన్ 30 మధ్య 19 దేశాల్లో 81 తాత్కాలిక ‘షట్‌డౌన్’ లను బ్రూకింగ్స్ అధ్యయనంలో విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వీటివల్ల 240 కోట్ల డాలర్ల (రూ.16,080 కోట్లు) నష్టం వచ్చినట్లు అంచనా తేలింది. ఈ 19 దేశా ల్లో అత్యధిక నష్టం భారత్‌లోనే (96 లక్షల 80 వేల డాలర్లు) సంభ వించింది. తరువాతి స్థానంలో సౌదీ అరేబియా (46 లక్షల 50 వేల డాలర్లు), మొరాకో (32 లక్షల డాలర్లు) నిలిచాయి.
అధ్యయనం జరిపిన 19 దేశాల్లో సర్వే జరిగిన కాలంలో 81 నెట్ అంతరాయాలు సంభవించాయి. అత్యధికంగా 22 షట్‌డౌన్లు లు భారత్‌లో చోటుచేసుకొన్నాయి. ఈ సంఖ్య ఇరాక్‌లో జరిగిన వాటితో సమానం. ఆ తరువాత స్థానంలో సిరియా (8 షట్‌డౌన్లు ), పాకిస్థాన్ (6 షట్‌డౌన్లు) చోటుచేసుకొన్నాయి. 2016లో భారత్ , ఉగాండా, అల్జీరి యా, ఇరాక్ సరసన చేరింది. ఆయా దేశాల్లో విద్యార్థులు పరీక్ష ల్లో మోసాలకు పాల్పడుతున్నందున ఆందోళనలు నెలకొనడం తో నెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 2016 మార్చిలో గుజరాత్‌లో రెవెన్యూ అకౌంటెంట్ల పరీక్ష కోసం 4 గంటల పాటు ఇంటర్నెట్‌ను మూసి వుంచారు. ఈ పరీక్షలు కీలకమైనవి కావడంతో నెట్ సర్వీసు లు అందిం చే సంస్థలను అన్ని నెట్ ఆధారిత సామాజిక మీడియా సర్వీసులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా మూసి ఉంచాలని ఆదేశించారు. మొబైల్స్ ద్వారా పరీక్షల్లో మోసాలకు పాల్పడకుండా ఈ జాగ్రత్త తీసుకొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటనను కూడా ఈ అధ్యయన నివేదికలో పొందుపరి చారు. ఈ నెట్ షట్‌డౌన్లు 6 రకాలుగా బ్రూకింగ్స్ నివేదిక వర్గీకరిం చింది. జాతీయ ఇంటర్నెట్, ఉప జాతీయ ఇంటర్నెట్, జాతీయ మొబైల్ ఇంటర్నెట్, ఉప జాతీయ మొబైల్ ఇంటర్నెట్, జాతీయ యాప్ / సర్వీసు, ఉప జాతీయ యాప్ / సర్వీసు (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్- విఒఐపి) ఈ వర్గీకరణలో ముఖ్యం. 36 సార్లు షట్‌డౌన్లు జాతీయ స్థాయి ఇంటర్నెట్‌లో చోటుచేసు కొన్నాయి. 22 సార్లు ఉప జాతీయ స్థాయిలో, 14 సార్లు జాతీయ యాప్ / సర్వీస్ స్థాయిలో షట్‌డౌన్లు చేశారు.
బ్రూకింగ్స్ అంచనాలు సమస్యను తక్కువ చేసి చూపినట్లు అర్థమవు తోంది. 2015 డిసెంబర్‌లో ఒక్క గుజరాత్‌లోనే 6 రోజుల పాటు ఇంటర్నెట్ షట్‌డౌన్‌వల్ల బ్యాంకులకు సుమారు రూ. 7000 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని మహా గుజరాత్ బ్యాంక్ సిబ్బంది సంఘం (ఎంజిబిఇఎ) ప్రధాన కార్యదర్శి కెవి బారోత్ తెలిపారు. 2015నుంచి మొత్తం 37సార్లు 11 రాష్ట్రాలు ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేశాయి. అందులో 22 ప్రస్తుత ఏడాది మొదటి 9 నెలల్లో చోటుచేసుకొన్నాయి. ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ సమాచారాన్ని సేకరించింది. దీనిని బట్టి బ్రూకింగ్స్ సంస్థ మొత్తం షట్‌డౌన్లను పరిగణనలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. అయితే ఆ సంస్థ మొత్తం నష్టాలు ఇంకా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి)పై ఈ షట్‌డౌన్ల ప్రభావాన్ని కూడా నివేదికలో వివరించారు. డిజిటల్ సమాచారం మూసివేతవల్ల సంభ వించిన ఆదాయ నష్టాలు ఇందులో లేవు. అలాగే కార్మికుల ఉత్పాదక శక్తిపై, వ్యాపార విస్తరణకు అడ్డంకులపై, మదుపరి – వినియోగదారు తదితరులపై వాటి ప్రభావాన్ని కూడా వివరించలేదు.
వర్ధమాన దేశాల్లో షట్‌డౌన్ల రికార్డులను మాత్రమే పరిశీలించారు. ఆదేశాల్లో కంటే అభి వృద్ధి చెందిన దేశాల్లో ఇంటర్నెట్ షట్‌డౌన్ల నష్టం చాలా ఎక్కువ అని నివేదిక తెలిపింది. ఉదాహర ణకు అమెరికా 18.438 లక్షలకోట్ల డాలర్ల (రూ. 1,235కోట్ల) జిడి పి ప్రస్తుతం కలిగి ఉంది. అందు లో 6 శాతం ఇంటర్నెట్ రంగం నుంచి వచ్చేదే. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు నెట్ అందుబాటులో లేకపోతే కనీసం 54 వందల 10 కోట్ల డాలర్ల (రూ. 3.62 లక్షల కోట్లు)ఆర్థికనష్టం సంభవిస్తుంది. ఆ అంతరాయం ఏడాది పాటు ఉంటే 2.8 ట్రిలియన్ డాలర్ల (రూ.187.6 లక్షలకోట్లు) నష్టం తప్పదు.
2020 నాటికి మొత్తం భారతీయులు ‘నెటిజన్లు’గా మారిపోతే భారతదేశ ఆర్థిక రంగం లక్ష కోట్ల డాలర్ల్ల ( రూ. 67లక్షలకోట్లు)కు ఎదుగుతుంది. భవిష్యత్తులో ఇంటర్నెట్ నిషేధాల వల్ల మరింత నష్టం వాటిల్లుతుందని నివేదిక హెచ్చరించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరి స్తున్న కొద్దీ షట్‌డౌన్లు దేశాలకు భారంగా పరిణమిస్తాయి. అంతర్జాతీయ సమాజం సమన్వయంతో కార్యాచరణకు దిగకపోతే భవిష్యత్తులో ఈ నష్టం అనేక రెట్లు పెరిగి ప్రపంచ ఆర్థిక అభివృద్ధి కుంటుబడుతుందని బ్రూకింగ్స్ హెచ్చరించింది. ఆర్థిక నష్టాలు ఎలా ఉన్నప్పటికీ చాలా దేశాల్లో అధికారులు ఆన్‌లైన్ సర్వీసులను, యాప్ లను అడ్డుకోవడానికే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పైగా ప్రజా భద్రత లేదా రాజకీయ ఆత్మరక్షణ కోసం ఈ అనౌచిత్యా నికి వారు పాల్పడుతున్నారు. ఇకపై ఆ అధికారు లు నెట్ స్తంభన వల్ల కలిగే నష్టం దృష్టిలో పెట్టు కొని వ్యవహరించాలని చెప్పకతప్పదు. కొద్ది కాలం పాటైనా నెట్ సర్వీసులు అన్నింటినీ బంద్ చేస్తే ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం చెప్పలేనంత ఉంటుంది. అంతే కాకుండా ప్రజల జీవితాలు ప్రమాదంలో పడు తాయి. పౌరులను వారి కుటుంబ సభ్యుల నుంచి, మిత్రుల నుంచి నెట్ అంతరం విడదీస్తుంది. అటు వంటి కఠిన చర్యలకు పాల్పడే ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో చులకన అవుతాయి. విశ్వా సాన్ని కోల్పోతాయి. ప్రపంచానికి నెట్ బంద్‌ల నష్టం ఈ నివేదిక చెబుతున్న 240 కోట్ల డాలర్లు కాకుండా ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చునని ఆ నివేదికే చెబుతోంది. సుపరిపాలనకు నెట్ బంద్ కాకపోవడం కూడా ఒక అత్యవసర లక్షణం అని నిపుణులు చెబు తున్నారు. ముఖ్యంగా భద్రత పేరుతో ఇటువంటి చర్యలకు పాల్పడడం మరింత గర్హనీయమని వారు హెచ్చరిస్తున్నారు.
దేవనిక్ సహా