Wednesday, April 24, 2024

ఎస్ఐ కారు బీభత్సం…. మహిళకు గాయాలు(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎస్‌ఐ మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో జరిగింది. చిల్లా గ్రామంలోని ఓ గల్లీలో కారు అదుపు తప్పి ఓ మహిళను ఢీకొట్టడంతో కిందపడింది. కిందపడిన మహిళను తీస్తుండగా కారు ముందుకు పోనివ్వడంతో కారు చక్రాల కింద ఆమె నలిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News