Saturday, April 20, 2024

రోడ్డుపై ఆరబోసిన ధాన్యం సీజ్…. రైతుపై కేసు నమోదు…

- Advertisement -
- Advertisement -

యజమానిపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ

మన తెలంగాణ/వెల్దుర్తి : ఇష్టానుసారంగా రోడ్డుపై ఆరబోసిన ధాన్యం సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. బుధవారం వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై ఆరబోసిన ధాన్యంను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ…. రోడ్లుపై ధాన్యం ఆరబోయడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, గ్రామాల్లో అవగాహన కల్పించినా కొందరు వ్యక్తులు పట్టించుకోకపోవడం వల్లే కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. ఇష్టానుసారంగా రోడ్డు సగభాగంలో ధాన్యం ఆరబోసి, ఆరబోసిన ధాన్యంపై రాళ్లు, టాపర్లు ఏర్పాటు చేయడం వల్ల, ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులకు రోడ్డు పై పోసిన ధాన్యం కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రైతులు పండించిన ధాన్యాన్ని గోదాముల వద్ద, తమ పొలాల వద్ద ఆరబోసుకోవాలని సూచించారు. రోడ్డుపై ధాన్యన్ని ఆరబోస్తే ధాన్యాన్ని సీజ్ చేసి, యజమాని పై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News